చంద్రబాబు ముందు.. సీఎం జగన్ ఓ అమూల్ బేబీ – నారా లోకేష్

-

చంద్రబాబు ముందు.. సీఎం జగన్ ఓ అమూల్ బేబీ అని చురకలు అంటించారు నారా లోకేష్. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని అంటుంటే జగన్ కి మాత్రమే తెలిసిన అభివృద్ధి, మనకు కనబడని అభివృద్ధి ఏంటా అని అనుకునేవాడిని అని పేర్కొన్నారు. నిన్న తిరుమలలో గంజాయి సరఫరా వీడియో చూసాక తెలిసింది… జగన్ స్థాయి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించింది అని చెప్పారు.

దేశ‌మంతా ఏపీ వైపు చూసేలా చేస్తానంటే, ఏంటో అనుకున్నాం. గంజాయి స‌రుకు కోసం దేశ‌మంతా ఏపీ వైపు చూసేలా చేస్తావ‌నుకోలేదు. నీ పాల‌న‌లో బ‌డిలో గంజాయి మ‌త్తులో పిల్ల‌లు తూగుతు న్నా రు. ప‌ర‌మ‌ ప‌విత్ర‌మైన తిరుమ‌ల కొండ‌పై..ఆలయ ఉద్యోగులే గంజాయి అమ్మ‌కాలు సాగిస్తున్నారు. కేంద్రంలో ఏ సంస్థ నివేదిక వెల్ల‌డించినా డ్ర‌గ్స్‌, గంజాయిలో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌. ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సిగ్గు అనిపించ‌డంలేదా? అని నిప్పులు చేసారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news