ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా నిన్న నెల్లూరు సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక మీటింగ్ లో మాట్లాడిన నారా లోకేష్ మహిళల గురించి ప్రస్తావించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలను వేధించిన వారిని వదిలి పెట్టం అన్నారు. ఏపీలో పాలనలో ఉన్న వైసీపీ నేతలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు అంతా తమ తల్లిని అవమానించారని బాధపడ్డారు. రాష్ట్రంలో జీవిస్తున్న ఏ ఒక్క మహిళ కూడా అవమాన పడకూడదు అంటూ మహిళల గురించి గొప్పగా మాట్లాడారు.
మహిళలపై నాకు ఎంత గౌరవం అంటే నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నాకు ఆడపిల్ల పుట్టాలని దేవుణ్ణి బలంగా కోరుకున్నానన్నారు. ఈ మోసకారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించేందుకే యువగలం పుట్టిందన్నారు.