నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా మొన్నటి వరకు నష్ట పోయిన వారిని పరామర్శిస్తూ… వారికి వరాల వర్షం కురిపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన పై… టిడిపి యువ నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ నారా లోకేష్ మండిపడ్డారు.
“ముఖ్యమంత్రి గారూ! మీరు వెళ్లింది మీ ఇసుకమాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి! మీ వంధిమాగధులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు. మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు వల్ల జరిగిన వేలకోట్ల నష్టం పరిశీలించడానికి! ప్రజల్ని దూరం పెట్టి పళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగడానికి కాదు. జనం బాధలు మీకు అంత పైశాచికఆనందం కలిగిస్తున్నాయా?జగన్ గారు ” అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
ముఖ్యమంత్రి గారూ! మీరు వెళ్లింది మీ ఇసుకమాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి! మీ వంధిమాగధులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు.(1/2) pic.twitter.com/xbZXqDFfJd
— Lokesh Nara (@naralokesh) December 2, 2021