మహిళలకు “డైమండ్ పాప” క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ చురకలు అంటించారు. ఇవాళ ఏపీ మంత్రి రోజాపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నాకు చీర, గాజులు పంపిస్తానని మహిళలను అగౌరవపరిచేలా రోజా మాట్లాడారని.. నాకు చీర, గాజులు పంపాలని ఆ డైమండ్ పాపకు చెప్పానని నారా లోకేష్ గుర్తు చేశారు. ఏపీలో ఎక్కడా దిశా చట్టం అమలు కావడం లేదని ఆగ్రహించారు.
టిడిపి హయాంలో 10 కోట్లతో నిర్మించే తలపెట్టిన ఈ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేసిందని ఆరోపించారు నారా లోకేష్. నిర్మాణం ఆపేయడంతో కమ్యూనిటీ హాల్ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసి వాటిల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు అని బీసీలు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టిడిపి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్. విద్యా దీవెన, వసతి దీవెన అంటున్నారు తప్ప తమకు డబ్బు రావడంలేదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాదయాత్రలో లోకేష్ తో సమస్యలు చెప్పుకున్నారు.