టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున..అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్) నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున తనయులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. కాగా, నాగార్జున తన భార్య అమలతో పెళ్లికి ముందర పలు సినిమాల్లో ఆన్ స్క్రీన్ పెయిర్ గా పని చేశాడు. ఆ తర్వాత వారు ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్..అనగా రియల్ కపుల్ అయిపోయారు. పెళ్లికి మందర వీరు కలిసి నటించిన సినిమాల గురించి తెలుసుకుందాం.
నాగార్జున-అమల తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘కిరాయి దాదా’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, నాగార్జున-అమలల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఆ తర్వాత మోహన్ గాంధీ దర్శకత్వంలో ‘చినబాబు’ అనే చిత్రంలో నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున-అమల జంటగా నటించిన ‘శివ’ ఫిల్మ్..ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత ఎస్.వీ.రాజేంద్రసింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ యుద్ధం’ బోల్తా కొట్టింది.
ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో చివరగా వీరిరువురు జంటగా నటించారు. ఆ తర్వాత అమల సినిమాల్లో కనిపించలేదు. నాగార్జున ఇప్పటికీ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. కాగా, అమల మాత్రం కీలక పాత్రలు పోషిస్తున్నది. త్వరలో విడుదల కానున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీలో తల్లి పాత్ర పోషించింది అమల. నాగార్జున ..‘ది ఘోస్ట్’ ఫిల్మ్ లో నటిస్తున్నారు.