బ్రేకింగ్ : రాజీనామా లేఖతో గవర్నర్ వద్దకు సీఎం

Join Our Community
follow manalokam on social media

ఎట్టకేలకు పుదుచ్చేరి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. పుదుచ్చేరి అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన బల నిరూపణలో వి. నారాయణ స్వామి విఫలం అయ్యారు. ఈ నేపధ్యంలో దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు సాగిన  కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోయింది. బల నిరూపణలో విఫలం కాగానే, తన రాజీనామా లేఖతో నారాయణ స్వామి రాజ్ భవన్ కు పయనం అయ్యారు. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం ముగిసినట్టే అని చెబుతున్నారు.

ఇక తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళి సై ప్రస్తుతం పుదుచ్చేరి తాత్కాలిక గవర్నర్ గా బాధ్యతలు కూడా తీసుకున్నసంగతి తెలిసిందే. మరి కాసేపట్లో ఆమెను నారాయణ స్వామి కలసి రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు చెబుతున్నారు. అయితే అసెంబ్లీలో ఇతర పార్టీల బలాబలాలను, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తర్వాత గవర్నర్ తమిళిసై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయమే ఉండడంతో బహుశా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...