ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ కీలక సూచనలు చేశారు. కేసులు పెరుగుదలతో కరోనా ఇంకా పూర్తి తొలగిపో లేదని విషయం స్పష్టమైందని వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా ను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని గుర్తుచేశారు.
అయితే ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు మోడీ. దేశంలో దాదాపు 95 శాతం మంది వైద్యులు వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు.. పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం.. వ్యాట్ తగ్గిస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయి.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్రాలు తగ్గించకపోవడంతోనే ధరలు తగ్గలేదని తెలిపారు ప్రధాని మోదీ.