నవంబర్ 9 దేశ చరిత్రలో నిలిచిపోతుంది… అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం… ప్రధాని కీలక వ్యాఖ్యలు…!

-

జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయోధ్య తీర్పుపై మాట్లాడిన నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ తీర్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సుప్రీం చరిత్రాత్మక తీర్పు వెల్లడించిందన్నారు. అయోధ్యపై సుప్రీం మహోన్నత తీర్పు ఇచ్చిందన్న ఆయన భారత న్యాయవ్యవస్థలో ఇదో సువర్ణ అధ్యాయమని వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదంపై తీర్పుని యావత్ దేశం స్వాగతించిందన్న ప్రధాని… దీర్ఘ కాలిక సమస్యపై సుప్రీం తీర్పు వెల్లడించిందన్నారు.

ప్రజలు చాలా సంయమనం పాటించారన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడారని పేర్కొన్నారు. దేశ ప్రజలు అందరికి ధన్యవాదాలు, నవంబర్ 9 దేశ చరిత్ర గా మిగిలిపోతుందన్నారు. ఏకాభిప్రాయంతోనే తీర్పు వెల్లడించారన్న ఆయన… ప్రపంచానికి మన గొప్పతనం తెలిసింది అన్నారు. దశాబ్దాల పాటు సాగిన న్యాయప్రక్రియకు ముగింపు పలికారన్న మోడీ… భారత న్యాయవ్యస్తపై అంతర్జాతీయంగా ప్రసంశలు వస్తున్నాయని… నంబర్ 9 బెర్లిన్ గోడ కూలిన రోజు… కర్తార్ పూర్ కారిడార్ ప్రారభించారని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసి జీవించడమే నేటి సందేశమన్నారు.

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని… రాజ్యాంగం అన్నింటిని పరిష్కరిస్తుందన్నారు. అందరూ కలిసి కొత్త ఇండియా ను నిర్మించాలని మోడీ విజ్ఞప్తి చేసారు. సరికొత్త ప్రారంభానికి అయోధ్య తీర్పు వేదిక అయిందన్నారు. నవ భారత నిర్మాణం జరుగుతుందన్న ఆయన మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. ఇది సరికొత్త భారత్ అని, అందర౦ కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నూతన భారత్ ద్వేషాన్ని ధరిచేరనివ్వదని మోడీ స్పష్టం చేసారు. తీర్పుని గెలుపు ఓటములా చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. మన ఐఖ్యతే మనను ముందుకి నడిపిస్తుంధన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news