నిర్మాత‌గా మార‌నున్న‌ ఎన్టీఆర్‌..

-

ఇటీవ‌ల కాలంలో స్టార్ డమ్ అందుకున్న సినీ నటులు హీరోలుగా కొనసాగుతూనే, నిర్మాతలుగా కూడా మారిపోతున్నారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్నాడా…? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ నిర్మాత‌గా మారేందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ సహా మరికొంత మంది హీరోలు చిత్ర నిర్మాణరంగంలోకి దిగి సక్సెస్ లు అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వారి బాటలో సాగనున్నట్లు సమాచారం. తన చిన్న కొడుకు పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో తారక్ ఉన్నాడట. ఈ బాధ్యతలను ఆయన సతీమణి చూసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news