కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు…. సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామంటూ…

-

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సాగు చట్టాలపై ఆయన స్పందించారు. మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వల్ప మార్పులతో సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు. నిన్న మహారాష్ట్ర నాగ్ పూర్ లో జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారని.. 70 ఏళ్లలో రైతుల డెవలప్మెంట్ కోసం చేయని మోదీ చేసి చూపించారన్నారు. ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడం అంటే పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లు కాదని.. దేశానికి వెన్నముఖగా ఉన్న రైతుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువస్తూ.. ఈ మూడు  చట్టాలను తీసుకువచ్చాం, అయితే కొంతమంది రైతులకు ఈ విషయం నచ్చలేదని.. ఈ కారణంగా వాటిని వెనక్కి తీసుకున్నాం అన్నారు. అయితే విస్త్రుత సంప్రదింపుల అనంతరం.. మరికొన్ని మార్పులు చేసి వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకువస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసయా రంగాన్ని పరిపుష్టం చేయడమే తమ ఉద్దేశ్యం అని అన్నారు.

అయితే ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి దిగివచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news