హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్ : చాక్లెట్ల లాగా పిల్లలకు బైక్‌లు ఇవ్వం !

హీరో సాయిధరమ్ తేజ్‌ ఆక్సిడెంట్ పై సినీ నటుల వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్ ఇచ్చారు. నీ కామెంట్స్‌ తో తాను హర్ట్ అయ్యానని.. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చురకలు అంటించారు.

సాయితేజ్ అతివేగంతో లేరని.. సాయిధరమ్ తేజ్‌ది ప్రమాదమేనని పేర్కొన్నారు. ప్రమాదం పై చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇచ్చానని.. మా ప్యానల్‌లో పోటీ చేసి ఓడిపోయావు అంటూ ఎద్దేవా చేశారు నటుడు నరేష్. తనకు ఇండస్ట్రీలో చెడ్డ పేరు లేదని పేర్కొన్న నరేష్.. బైక్‌లు.. చాక్లెట్ల లాగా పిల్లలకు ఇవ్వ బోమని చురకలు అంటించారు. బైక్‌ ల విషయం లో జాగ్రత్తలు చెప్పడం తప్పు కాదని మండి పడ్డారు. కాగా మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి పర్వ దినా న రోడ్డు ప్రమాదం లో తీవ్రం గా గాయపడ్డ సంగతి తెలిసిందే.