సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నరేశ్‌-పవిత్ర లోకేశ్‌

-

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో అభ్యంతర వార్తలు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు..

 

తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు నరేష్ పవిత్ర లోకేష్. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని.. అలాగే కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానల్స్‌పై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. తమ ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తులో పేర్కొన్నారు.. వీరిద్దరూ కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా ప్రేక్షకులను అలరించారు పవిత్రా లోకేష్. సెకండ్ ఇన్నింగ్స్ లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ కేరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

సూపర్‌స్టార్ కృష్ణను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన వారికి నరేశ్ చిరాకు తెప్పించే పనులు చేసినట్టు.. అక్కడికి వచ్చిన వచ్చిన సెలబ్రెటీలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెతున్నాయి..అంతా కృష్ణ చనిపోయిన బాధలో ఉంటే.. నరేశ్ మాత్రం అదేదో ఫంక్షన్ లాగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎదురెళ్లి స్వాగతించడం నచ్చలేదని.. హుందాగా వ్యవహరించకపోవడంతో పాటు విషాద సమయంలో హడావుడిగా నడుచుకోవడం పట్ల అందరూ మండిపడుతున్నారు. అలాగే ఆయన ప్రవర్తనపై కుటుంబీకులకూ నచ్చలేదని.. నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిపి కూర్చోబెట్టడం కూడా ఎవ్వరికీ నచ్చలేదని అంటున్నారు. అదీగాక విషాద ఘటనతో బాధపడుతున్న కొందరికీ ఆమెను పరిచయం చేయడం మరింత ఎబ్బెట్టుగా అనిపించిందంటూ పలువురు మండిపడుతున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, రిలేషన్షిప్లో ఉన్నారని వార్తలు గుప్పుమన్న అనంతరం.. నరేశ్ మూడో భార్య వీరి మధ్యలోకి గొడవ చేయడం అంతటా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news