హిట్‌-2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి

-

శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో ‘హిట్ 2’ సినిమా రూపొందింది. ఈఒక యువతీ మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కీ, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడనేదే కథ. సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వచ్చాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ముఖ్య అతిథి ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు.

తాజాగా సస్పెన్స్ కి తెరదించేస్తూ, చీఫ్ గెస్టుగా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాదు – ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి నటించింది. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news