ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో నాథూరామ్ గాడ్సే ఫోటోలను ప్రదర్శించారని, దేశంలో మొదటి టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. అతని ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజూరి ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా..? అని ఘాటుగా స్పందించారు. మజిలీస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని, పోలీసులు ఇంటి తరఫున పగలగొట్టి ఉండేవారని అన్నారు. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా బీహార్ లోని పశ్చిమబెంగాల్ లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. అదే సమయంలో హైదరాబాద్ లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా నాథూరామ్ గాడ్సే ఫోటోలతో పలువురు డాన్స్ చేస్తూ కనిపించారు. ఇదే విషయంపై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.