మహానటి వర్సెస్ రంగస్థలం.. నేషనల్ అవార్డ్ ఫైట్..!

-

66వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాల హవా కనిపించేలా ఉంది. నేషనల్ అవార్డుల్లో ప్రాంతీయ విభాగంలో బెస్ట్ మూవీ పోటీల్లో రెండు తెలుగు సినిమాలు నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. అందులో ఒకటి మహానటి కాగా మరోటి రంగస్థలం. సావిత్రి జీవిత కథగా కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలిచింది. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటనా ప్రతిభ కనబరచింది.

ఇక రంగస్థలం సినిమాలో రాం చరణ్ కూడా అదరగొట్టాడు. సరిగా వినిపించని చిట్టిబాబు పాత్రలో రాం చరణ్ చితక్కొట్టేశాడు. ఈ రెండు సినిమాల్లో మహానటికి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఈసారి నేషనల్ అవార్డ్ ఎవరికి సొంతమవుతుందో చూడాలి. ఉత్తమ చిత్రంగానే కాదు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. త్వరలో ప్రకటించనున్న నేషనల్ అవార్డుల్లో ఏ సినిమాకు రికార్డుల పంట పండుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news