శనిహ్రానికి నువ్వుల నూనె, ఉప్పుతో పూజిస్తే ఈ రాశులకు సర్వకార్య జయం! ఏప్రిల్ 27 రాశిఫలాలు

-

మేషరాశి : మంచి రోజు, పనులు పూర్తి, ఆనందం, ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, విందులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

April 27th saturday daily horoscope
April 27th saturday daily horoscope

వృషభరాశి : అనుకూల ఫలితాలు, ఇంట్లో శుభకార్య సూచన, ధనవ్యయం, ఆనందం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, సోదర సహకారం, సఖ్యత.
పరిహారాలు: శివాభిషేకం, ప్రదోషకాలంలో శివాలయ సందర్శన మంచిది.

మిథునరాశి : ప్రతికూల ఫలితాలు, వ్యవహారాలు కలిసిరావు, దుఃఖం, చికాకు, పనుల్లో జాప్యం, ధననష్టం, శుభకార్యాల వల్ల ధనవ్యయం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి తులసీమాలతో అర్చన, అష్టోతర పూజ చేయించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి : అనుకూల ఫలితాలు, లాభం, కుటుంబ సఖ్యత, ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు, సంతోషం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, ఆంజనేయస్వామి దేవాలయ దర్శన మంచిది.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, ఆందోళన, అధికశ్రమ, ధనలాభం, కీర్తిలాభం, దేవాలయ సందర్శన.
పరిహారాలు: ఆంజనేయస్వామికి పూజ, సింధూర ధారణ చేయండి.

కన్యారాశి : ప్రతికూల ఫలితాలు, కుటుంబ కలహాలు, విరోధాలు, శుభకార్యప్రయత్నం, అధికశ్రమ, ఆర్థికంగా చిన్న ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.

తులారాశి : ప్రతికూలం. ఆకస్మిక ప్రయాణాలు, కలహాలు, అనవసర ఖర్చులు, పనుల్లో జాప్యం, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: శివాభిషేకం మంచి చేస్తుంది. లేదా సాయంత్రం పూట శివాలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి : అనుకూలం. పెద్దల కలయిక, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగ మార్పులు, ఆరోగ్యం, శుభకార్య ప్రయత్నం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి. దైవనామస్మరణ మంచిది.

ధనస్సురాశి : ప్రతికూలం, కీర్తినష్టం, ఆందోళన, అధికశ్రమ, ఖర్చులు, వివాదాలు.
పరిహారాలు: శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం, పూజ, ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది. చెడు ప్రభావం తగ్గుతుంది.

మకరరాశి: ప్రతికూల ఫలితాలు, శని ప్రభావంతో ఇబ్బందులు, ఆందోళన, అనవసర ఖర్చులు, వివాదాలు, విందులు. అనారోగ్య సూచన.
పరిహారాలు: శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం, ఉప్పుతో అష్టోతర పూజ చేయండి మంచి ఫలితం వస్తుంది.

కుంభరాశి : ప్రతికూలం, పనులు పూర్తికావు, అనవసర తిరుగుడు, స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. వివాదాలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి, ఆంజనేయస్వామికి అర్చన మంచి చేస్తుంది.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, ఆనారోగ్యం, విందులు, మిత్రుల కలయిక, బంధువుల సహకారం. ఆర్థికంగా పర్వాలేదు. కొత్త పనులు ప్రారంభించకండి.
పరిహారాలు: వేంకటేశ్వర/ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు, నవగ్రహాలకు ప్రదక్షిణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news