జాతీయ ఉత్తమ ఉపాధ్యా అవార్డులను ప్రకటించిన కేంద్రం

-

తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒక్కరు

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గల నివేదిత కిషోర్ విహర్ నుంచి మేకా సుసత్య రేఖ, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోర్గామ్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్రా రామారావు, వరంగల్ జిల్లా వెంకటాపూర్ కలాన్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండారి రమేష్, జోగులాంబ జిల్లా జెడ్పీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు బీఎస్ రవి ఈ  అవార్డులను అందుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news