వీడియో వైరల్: భారత జాతీయపతాకం తో పుచ్చకాయలని తుడుస్తూ… విచారం చేపట్టిన పోలీసులు..!

-

మన జాతీయ పతాకాన్ని మనం ఎంతో గౌరవంగా చూసుకోవాలి. దీర్ఘ చతురస్రాకారంలో కాషాయ రంగు తెలుపు పచ్చ రంగులతో మన త్రివర్ణ పతాకం ఉంటుంది. మధ్యలో 24 ఆకుల కలిగిన నేవీ బ్లూ రంగు లో ఉండే అశోక చక్రం ఉంటుంది. భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. జాతీయ పతాకాన్ని అవమానించడం తప్పు.

జాతీయ పతాకంలో ఉండే కాషాయం స్వచ్ఛత, ఆధ్యాత్మిక.. తెలుపు శాంతికి, సత్యానికి.. ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలు. ఇంతటి గొప్ప జాతీయ పతాకాన్ని ఎప్పుడు అవమానించకూడదు. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి జాతీయ పతాకాన్ని పుచ్చకాయలని శుభ్రం చేయడానికి ఉపయోగించాడు.

ఇది ఉత్తరప్రదేశ్ ఝాన్సీ లో చోటు చేసుకుంది అక్కడ ఉన్న నెటిజన్లు ఈ వీడియోని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పుచ్చకాయల మీద ఉండే దుమ్ముని శుభ్రం చేయడానికి జాతీయ పతాకాన్ని ఉపయోగించాడు ఓ వ్యక్తి. గతంలో కూడా ఇలాంటివి చాలా చోటు చేసుకున్నాయి ఇదే మొదటిసారి కాదు. మన జాతీయ పథకాన్ని ఇలా ఇన్సల్ట్ చేయడం నిజంగా తప్పు. ఈ వీడియో చూసిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news