కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక పరిణామం చోటు చేసుకుంది. వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చార్జిషీట్లో ఉంచింది. 5000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులని వీళ్లు మళ్లించడానికి ప్రధాన సూత్రధారులు అని పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అవినీతి దుర్వినియోగం, వంశపారపర్యం పాలనుకు నిదర్శమని BJP ఆరోపించింది. అయితే ఈ కేసు మూలాలు 1950 నాటివి అని పార్టీ చెప్తోంది. అయితే అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పింది. 1954 లేఖని చూసినట్లయితే నేషనల్ హెరాల్డ్ ని నిధుల సేకరణ కోసం ఉపయోగించడం గురించి ఆయన ఆందోళన చెందారు. ప్రభుత్వ పేరుని ఉపయోగించుకుని నిధులను సేకరించడం గురించి జవహర్ లాల్ నెహ్రూ అలర్ట్ చేశారు.
అనుమానస్పదంగా ఆక్రమ మార్గాల ద్వారా వచ్చే నిధుల్ని అంగీకరించవద్దని ఆయన చెప్పారట. కాంగ్రెస్ బాధ్యత లేకుండా అవినీతి మార్గంలో వెళ్ళిందని విమర్శకులు అంటున్నారు. అప్పట్లో పటేల్ హెచ్చరికలు నిజమయ్యాయి అని బీజేపీ నాయకులు చెప్తున్నారు కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ పేరు తో ఎన్నో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు అని రాహుల్ సోనియా ఆధీనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ రహస్యంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈడీ చార్జిషీట్లో చెప్పింది. ఇది ఆర్థిక పొరపాటు కాదని వ్యక్తిగత లాభం కోసమే దుర్వినియోగం చేసినట్లు చెప్పింది.
1950లో హిమాలయన్ ఎయిర్ వేస్ నుంచి నేషనల్ హెరాల్డ్ కి ఏకంగా 75 వేల రూపాయలు విరాళం వచ్చింది. నెహ్రూ వల్లభాయ్ పటేల్ కి ఈ విషయం గురించి లేఖ కూడా రాశారు. భారత వైమానిక దళం అభ్యంతరాలు చెప్పినప్పటికీ ప్రభుత్వ కాంట్రాక్ట్ ని ఈ సంస్థ పొందింది. విరాళం ఇచ్చిన వాళ్లలో అఖాని ఒకరిని బ్యాంకు ని మోసం చేసిన కేసు ఆయనపై ఉందని.. పటేల్ అప్పట్లో హెచ్చరించారు. జెపి శ్రీ వాస్తవ లాంటి వ్యాపారుల నుండి అప్పట్లో ఉన్న కేంద్ర మంత్రి అహ్మద్ కిద్వాయ్ విరాళాలు తీసుకున్నట్లు కూడా ఆరోపించారు. 1950లో మే నెలలో ఈ విషయం గురించి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ కి సమాధానంగా నెహ్రూ సమాధానం చెబుతూ దీని గురించి తన అల్లుడు హెరాల్డ్ జనరల్ మేనేజర్ ఫిరోజ్ గాంధీ చూసుకుంటారని చెప్పారట.
ఒకవేళ కనుక అప్పట్లో నెహ్రూ దీని గురించి సీరియస్ గా నిర్ణయం తీసుకున్నట్లయితే నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగి ఉండేది కాదని చెబుతున్నారు. తర్వాత నెహ్రూ లేఖ రాసిన తదుపరి రోజు మే 6న ప్రత్యుత్తరం రాశారు. పటేల్ నెహ్రూకు లేఖ రాస్తూ నెహ్రూ చేసిన వాదనని రివర్స్లో వాదించారు. మూడు సంవత్సరాల నుంచి తాను పత్రిక ఆర్థిక వ్యవహారాల్లో లేనని బాధ్యతను మృదలకి ఇచ్చినట్లు వివరించారు. కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగి ఉండొచ్చని ఒప్పుకున్నారు. లాభనష్టాలు ఉంటాయి కాబట్టి జవాబు దారితనం ఉండదని ఆయన చెప్పారు.
ఇప్పుడు తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి మొత్తం బయటకు కదిలించారు. ప్రభుత్వ ఆస్తుల్ని గాంధీ కుటుంబంబికులు స్వాహా చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన వాదనలను బీజేపీ విమర్శలు ఆరోపణలకు దగ్గరగా ఉన్నాయి. బీజేపీ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ కుటుంబ సంస్థల పని చేసిందని రాజకీయ పలుకుబడిని వ్యక్తిగతంగా ఉపయోగించుకుందని. రాజకీయ కక్ష్య సాధింపు చర్యగా కాంగ్రెస్ వాదిస్తున్నా ఈడి చార్జ్షీట్లో ఉన్న అంశాల ముందు ఏమి మాట్లాడలేకపోతోంది. బీజేపీ దీనిని అంత సులువుగా వదిలేలా లేదు.