ఆ రాష్ట్రంలో లోక్‌సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. మళ్లీ ఎన్నికలు తప్పవా?

-

పంజాబ్‌ రాష్ట్రంలో  ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఒకవేళ వీరు విజయం సాధిస్తే.. ఈ ఎలక్షన్స్ ముగియగానే.. మరోసారి ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది. వీరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే.. ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీచేస్తుండటం గతంలో ఎన్నడూ జరగలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఇందులో 9 నియోజకవర్గాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఆరు లోక్‌సభ స్థానాల్లో ఒక్కో ఎమ్మెల్యే .. మరో మూడు స్థానాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. పోటీపడుతున్న ఎమ్మెల్యేల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ, మిగతా ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు చివరి దశలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. జూన్ 4వ తేదీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news