సెల్ఫీ పిచ్చి.. యువ‌కుడి ప్రాణాలు తీసింది..

-

స్టంట్లు చేసేట‌ప్పుడు, ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతాల్లో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్తగా ఉండాల‌ని, సెల్ఫీలు తీసుకోరాద‌ని, పిచ్చి పిచ్చి ప‌నులు చేయ‌రాద‌ని ఎంత చెప్పినా కొంద‌రి చెవికి ఎక్క‌డం లేదు. ఫ‌లితంగా ప్రాణాల‌ను కోల్పోతున్నారు. సెల్ఫీ పిచ్చి ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాల‌ను తీసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో యువ‌కుడు సెల్ఫీ పిచ్చి వ‌ల్ల ప్రాణాల‌ను కోల్పోయాడు. వివ‌రాల్లోకి వెళితే..

20 year old died by felling in well when taking selfie

త‌మిళ‌నాడులోని తిరుప‌తుర్ జిల్లా వ‌నియంబ‌డి ప్రాంతం చిన్న‌మొత్తుర్ గ్రామానికి చెందిన కె.సంజీవ్ అనే 20 ఏళ్ల యువ‌కుడు త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న పొలం వ‌ద్ద ట్రాక్ట‌ర్ పై ఉండి సెల్ఫీలు తీసుకుని త‌న స్నేహితుల‌కు పంపించాడు. వారు ఆ సెల్ఫీలు బాగున్నాయ‌ని చెప్ప‌డంతో అత‌ను ట్రాక్ట‌ర్‌ను స్టార్ట్ చేసి దాన్ని వెన‌క్కి న‌డిపిస్తూ సెల్ఫీలు తీసుకోవ‌డం ప్రారంభించాడు. అయితే ట్రాక్ట‌ర్ అదుపు త‌ప్పి వేగంగా వెన‌క్కి వెళ్లి అక్క‌డికి స‌మీపంలో ఉన్న ఓ వ్య‌వ‌సాయ బావిలో ప‌డిపోయింది.

ఈ క్ర‌మంలో ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన చుట్టుపక్క‌ల రైతులు వెంట‌నే పోలీసుల‌తోపాటు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సంజీవ్ న ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే అత‌ను మృతి చెందాడు. దీంతో బావి నుంచి వారు నీటినంతా తోడేశారు. ఆ బావి 120 అడుగుల లోతు ఉండ‌గా అందులో 35 ఫీట్ల మేర నీరుంది. దీంతో మోటార్ల స‌హాయంతో నీటిని తోడి సంజీవ్ మృత‌దేహాన్ని వెలికి తీశారు. కాగా సంజీవ్ కేట‌రింగ్ కోర్సును పూర్తి చేసి ఓ సంస్థ‌లో ఇటీవ‌లే ఉద్యోగంలో చేరాడు. అత‌ను అక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో అత‌ని కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news