2020లాగే 2021 కూడా ఉంటుంది, కోవిడ్ పోయింద‌ని అనుకోకండి.. నిపుణుల హెచ్చ‌రిక‌..!

Join Our Community
follow manalokam on social media

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుత‌న్న వేళ కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గ‌డంతో ఇక కోవిడ్ అంతం అయింద‌ని, రిలాక్స్ అవొచ్చ‌ని చాలా మంది అనుకుంటున్నారు. కానీ క‌థ ఇంకా అయిపోలేద‌ని, ముందుంది ముస‌ళ్ల పండ‌గ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చెప్పిన‌ట్లుగానే ప్ర‌స్తుతం ప‌లు చోట్ల క‌రోనా కేసుల సంఖ్య కూడా మ‌ళ్లీ పెరుగుతోంది.

2021 will be same as 2020 do not neglect against corona

దేశంలో మ‌హారాష్ట్ర‌తోపాటు ప‌లు చోట్ల క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది. గ‌త నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్య‌లో మ‌ళ్లీ పెరుగుద‌ల క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో క‌రోనా పూర్తిగా అంత‌మైంద‌ని అనుకోవ‌ద్ద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌కు చెందిన మాజీ హెడ్ సైంటిస్టు డాక్టర్ రామ‌న్ గంగాఖేడ్క‌ర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని హెచ్చ‌రించారు.

2020లో మ‌నం ఎలాగైతే క‌రోనా ప్ర‌భావాన్ని చూశామో 2021లోనూ అదేవిధంగా ఉంటుంద‌ని అన్నారు. క‌నుక జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, క‌రోనా ముప్పు ఇప్పుడ‌ప్పుడే అంత సుల‌భంగా పోద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని హెచ్చ‌రించారు. ఇక గ‌త కొద్ది రోజుల నుంచి మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తుండ‌డంతో క‌రోనా సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...