హిందూ శవాలకు మేమున్నాం అంటున్న ముస్లిం యువకులు

భారతదేశం చరిత్రలో చూడని విధంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. కరోనా దెబ్బకు ఇప్పుడు భారత్ లో అంత్యక్రియలు కూడా సమస్యగానే ఉన్నాయి. వైద్యం, అలాగే ఇతర సామాగ్రి కూడా తీవ్ర కొరత ఉంది. ఈ క్రమంలో ముస్లిం యువకుల బృందం ఉత్తరప్రదేశ్ లో తమ పెద్ద మనసు చాటుకుంది. రంజాన్ పాటిస్తూ, ఉత్తరప్రదేశ్ లక్నోలో హిందూ కోవిడ్ బాధితులకు అంత్యక్రియలు నిర్వహించారు.

పిపిఈ కిట్లు ధరించిన యువకులు ఎవరూ లేని వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలోని మక్బారా గొల్గంజ్ ప్రాంతంలో నివసిస్తున్న 33 ఏళ్ళ ఇమ్దాద్ ఇమాన్, స్టోర్ యజమాని మరియు గ్రాఫిక్ డిజైనర్, అతని 22 మంది బృందంతో కలిసి ఏడుగురు హిందూ బాధితుల దహన సంస్కారాలకు సహాయం చేశారు. 30 మంది ముస్లిం బాధితులను కూడా సమాధి చేశారు.