చెన్నైలో ఓ నిత్య పెళ్ళికూతురు లీలలు బయటపడ్డాయి. దీంతో… ఆ నిత్య పెళ్ళికూతురు అయిన రహీద కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడి మోసం చేసింది రహీద. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి, సంపన్న యువకులతో పరిచయం పెంచుకుంది రహీద.
చివరకు వారిని పెళ్లాడి, ఇంట్లో అందిన కాడికి దోచుకొని పరారయ్యేదట రహీద. సేలంకు చెందిన మొదటి భర్త, ఫైనాన్షియర్ మూర్తి ఫిర్యాదు తో రహీద భాగోతం బయటపడింది. ఇప్పటి వరకు ఏపితో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 8 మందిని వివాహమాడింది రహీద. ఇక పరారీలో ఉన్న రహీదా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.