పాపాలు చేస్తే చనిపోయిన తర్వాత నరకాని వెళ్తారు అంటారు. కొందరు చనిపోవడానికే నరకం చూస్తారు. కానీ కొంతమందికి మాత్రం చావు తేలిగ్గా వస్తుంది. రెప్పపాటు కాలంలో మృత్యువు ఒడిలోకి చేరుకుంటారు. ఈ మధ్య అలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. డ్యాన్స్ చేస్తూ, పాటలుపాడుతూ, స్పీచ్ ఇస్తూ, జిమ్ చేస్తూ.. ఆఖరికి కన్యాదానం చేస్తూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తి యోగా క్యాంపులో జాతీయ జెండాతో ప్రదర్శన ఇస్తుండగా చనిపోయాడు. అతను యోగాసనం వేశాడు అనుకోని అక్కడ ఉన్నవారంతా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు..ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం యోగా శిబిరంలో జాతీయ జెండాతో ప్రదర్శన ఇస్తుండగా 73 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుకు గురై మరణించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. నగరంలోని ఫూటీ ఖోటీ ప్రాంతంలో ఓ సామాజిక కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. నివేదిక ప్రకారం, మరణించిన బల్వీర్ సింగ్ ఛబ్రా, కొంతమంది వ్యక్తులతో ప్రదర్శన కోసం శిబిరానికి వచ్చాడు. ఛబ్రా, దుస్తులు ధరించి, చేతిలో జాతీయ జెండాతో దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేస్తూ మరణించారని యోగా శిబిరంతో సంబంధం ఉన్న రాజ్‌కుమార్ జైన్ తెలిపారు.
“ఛబ్రా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. మొదట్లో ఇది అతని ప్రదర్శనలో భాగమని మేము భావించాము, కానీ అతను ఒక్క నిమిషం కూడా లేవకపోవడంతో మాకు అనుమానం వచ్చింది” అని రాజ్‌కుమార్ జైన్ అన్నారు. ఛబ్రాకు CPR చేసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ECG మరియు ఇతర పరీక్షల తర్వాత అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఛబ్రా కుమారుడు జగ్జీత్ సింగ్ తన తండ్రి చాలా సంవత్సరాలుగా దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. మృతుడు తరచూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడట. ఛబ్రా కళ్లు, చర్మాన్ని దానం చేసినట్లు మృతుడి కుమారుడు తెలిపారు. ఈ వీడియో చూస్తుంటే..చావు ఎంత ఈజీగా వస్తుందా అనిపిస్తుంది. ఇలా చనిపోయే ప్రాణానికి మనం ఎన్ని ఆశలు, ఎన్ని పంతాలు, ఎంత ఆలోచన..ఇంకేదో సాధించాలి అనే తపనతో ఉన్న సమయాన్ని వృద్ధా చేస్తుంటాం కదా..!