2024 పార్లమెంట్ ఎన్నికల ముందు పంజాబ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరగా.. ఇవాళ ఆప్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జలంధర్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ కాషాయ పార్టీలో జాయిన్ కాగా వారికి పార్టీ కార్యదర్శి వినోద్ తాళ్లే పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే.. జలంధర్ నుండి ఆప్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించబడిన రింకూ బీజేపీలో చేరడం ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ గా తెలుస్తుంది. 2023లో జరిగిన ఉప ఎన్నికలో జలంధర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 58,691 ఓట్ల తేడాతో రింకూ లోక్సభకు ఎన్నికయ్యారు. కాగా పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్ సభ స్థానాలకు ఏదో విడతలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు జూన్ 4 వెలువడనున్నాయి.