కేసీఆర్ గొప్ప నాయకుడు.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్..!

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై  ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం దానం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గొప్ప నాయకుడు అని.. పక్కన ఉన్న వాళ్లే ఆయనను భ్రష్టు పట్టించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కోసం కేటీఆర్ కోర్టుకు వెళితే.. అక్కడే నా సమాధానం చెబుతా అని అన్నారు. నాడు వాళ్లు చేసింది సబబు అయితే.. ఇప్పుడు ఇది కూడా కరెక్టే అని తెలిపారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు దక్కకపోవడం మూలంగానే మారాల్సి వచ్చిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలల్లో రూ.3500 కోట్లు సంపాదిస్తే.. పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఎంత సంపాదించి ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తప్పకుండా సికింద్రబాద్ లో ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్లానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దానం నాగేందర్ కి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఆదేశించాలంటూ రాజు యాదవ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్దమని పిటిషన్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news