సెప్టెంబర్‌లో చిన్నారులకు వ్యాక్సిన్: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులకు కొవిడ్ టీకాల పంపిణీ సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని, ఇది వైరస్ చెయిన్‌ను బ్రేక్ చేయడంలో కీలక అడుగు అవుతుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.

ఇప్పటికే జైడస్ క్యాడిల్ టీకా ట్రయల్స్ పూర్తయ్యాయని భావిస్తున్నాను. అత్యవసర వినియోగ అనుమతి కోసం ఆ సంస్థ ఎదురు చేస్తున్నది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ట్రయల్స్ కూడా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉన్నది. ట్రయల్స్ పూర్తికాగానే టీకా పంపిణీకి అనుమతులు లభించవచ్చు. ఫైజర్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అమెరికా రెగ్యులేటరీ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతుల ఇచ్చింది. మూడు టీకాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో చిన్నారులకు టీకా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని నమ్ముతున్నాను. దీనిని దృష్ట్యా దేశంలో కొవిడ్-19 మహమ్మారి చెయిన్‌ను వీలైనంత త్వరగా బ్రేక్ చేయడానికి అవకాశం లభిస్తుంది’ అని డాక్టర్ గులేరియా తెలిపారు.

మనకు స్వదేశీ టీకాల అవసరం కూడా ఎంతో ఉన్నది . అందుకే, భారత్ బయోటెక్, జెడస్ క్యాడిలా వ్యాక్సిన్ల చాలా ముఖ్యం. ఫైజర్ వ్యాక్సిన్‌ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆ టీకా సురక్షితమని ఇప్పటివరకు ఉన్న డేటా సరిపోతుంది. కానీ, అవసరమైన గణాంకాలు లేకుండా కచ్చితంగా సురక్షితమని చెప్పలేం. సెప్టెంబర్‌లో చిన్నారులకు ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని మనం విశ్వసించవచ్చని గులేరియా స్పష్టం చేశారు.

11 నుంచి 17 ఏండ్ల మధ్య గల పిల్లలకు కరోనా వైరస్ సోకే ముప్పు 18 నుంచి 30శాతం పెరిగే ప్రమాదం ఉన్నదని ఇటీవల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడికల్ జనరల్ లాన్సెట్ ప్రచురించింది. ఈ నేపథ్యలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పై వ్యాఖ్యలు చేశారు.