నోరు అదుపులో పెట్టుకో… కోమటిరెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వార్నింగ్‌

నల్గొండ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ లు వర్సెస్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. జెడ్పీ సమావేశంలో గానీ.. ఇతర కార్యక్రమాల్లో గానీ ప్రోటోకాల్ పద్ధతులు పాటించాలని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

అయితే… దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి గట్టిగానే స్పందించారు. మేము ప్రోటోకాల్ చూస్తున్నామని ఏ సభ్యున్ని అయిన గౌరవించాల్సిందే అంటూ గతంలో వాళ్లకు ఆ సంస్కృతి లేదని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చురకలు అంటించారు. మేము ప్రొటోకాల్ పద్ధతులు మిస్స్ కానివ్వమన్న భూపాల్ రెడ్డి…. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎంపీలకు వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో వాళ్ల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇక చివరికి ప్రోటోకాల్ పద్ధతులు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ…. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.