కశ్మీర్​కు మరో 2000 మంది సీఆర్​పీఎఫ్ సైనికులు

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ కు అదనంగా 20 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ ప్రకటించింది. జమ్ము కశ్మీర్​లో వరుసగా పౌర హత్యలు, ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

2000 మందితో కూడిన ఈ బలగాలను పూంచ్​, రాజౌరీ జిల్లాలో మోహరించనున్నట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. 8 సీఆర్​పీఎఫ్​ కంపెనీలను జమ్ము కశ్మీర్​ సమీపంలోని ప్రదేశాల నుంచి తరలించగా.. 10 కంపెనీలను దిల్లీ నుంచి పంపించనున్నట్లు తెలిపింది. జమ్ములో భారీ ఉగ్రదాడి జరగనుందనే నిఘా వర్గాల​ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జమ్ము కశ్మీర్​ రాజౌరీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మరోవైపు డిసెంబర్​ 16న ఆర్మీ క్యాంప్​ సమీపంలో నలుగురు పౌరులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news