BREAKING : రేపు విశాఖకు సీఎం జగన్

-

ఏపీ సీఎం జగన్‌ రేపు విశాఖకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మృతి చెందిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీ రావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు సీఎం జగన్‌. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

రేపు(గురువారం) ఉదయం 6 గంటలకు తులసీరావు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన యలమంచిలికి తరలించనున్నారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీ ని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news