మోడీ పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన ట్వీట్..!

-

మోడీ ప్రసంగంలో అహంకారం ఇంకా మిగిలే ఉందని, మఖ్యమైన విషయాలపై ఏదైనా మాట్లాడతారని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికలు అయ్యాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రసంగంపై పలు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఈరోజు సాధారణ ప్రసంగం కంటే ఎక్కువసేపు ప్రసంగించారని. నైతిక మరియు రాజకీయ ఓటమి తర్వాత కూడా, అహంకారం ఇంకా మిగిలి ఉందని స్పష్టంగా అర్ధం అయ్యిందన్నారు. చాలా ముఖ్యమైన విషయాలపై మోదీజీ ఏదైనా మాట్లాడతారని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే మిగిలిందని తెలిపారు.

అలాగే నీట్ సహా ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలలో పేపర్ లీక్ గురించి అతను యువత పట్ల కొంత సానుభూతిని చూపిస్తాడు అనుకున్నారు, కానీ తన ప్రభుత్వం యొక్క భారీ రిగ్గింగ్ మరియు అవినీతికి అతను ఎటువంటి బాధ్యత వహించలేదని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం మరియు రైల్వేల పూర్తి నిర్వహణ లోపం గురించి మోడీ జీ కూడా మౌనంగా ఉన్నారని, మణిపూర్ గత 13 నెలలుగా హింసాకాండలో చిక్కుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news