కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా శివమొగ్గలో ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు ప్రధాని. అలాగే ఎయిర్ పోర్టులో చేపట్టిన మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 775 ఎకరాలలో 450 కోట్లతో శివమొగ్గలో ఎయిర్ పోర్టును నిర్మించారు. అనంతరం ఎయిర్ పోర్టు మొత్తం కలియతిరిగారు ప్రధాని. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ. రాబోయే సంవత్సరాలలో భారత్ లో వేలాది విమానాల అవసరం ఏర్పడుతుందని అన్నారు. ఈ రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి విమానాలు దిగుమతి అవుతున్నాయని.. త్వరలోనే అవి భారత్ లోనే తయారు చేయగలుగుతామని పేర్కొన్నారు.