సోము వీర్రాజు కాన్వాయ్ ని అడ్డుకున్న ఆప్ కార్యకర్తలు

-

ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ ఎనిమిది గంటల పాటు విచారించింది. ఆ తరువాత సిసోడియాను అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలకపాత్ర పోషించాడు. అయితే స్కామ్ కి సంబంధించి బ్యూరోక్రాట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.

అయితే సిసోడియ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఆప్ శ్రేణులు నిరసనకు దిగారు. బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయ్ ని ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆప్ శ్రేణులను బిజెపి శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాన్వాయ్ ని అడ్డుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆన్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news