దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు ఆపడానికి కారు ముందు భాగంపై దూకాడు. ఈ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన ఒక కారుని ఆపడానికి ఢిల్లీలోని ధౌలా కువాన్ లో ఆన్-డ్యూటీ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేసారు. అయినా సరే కారు డ్రైవర్ కారు ఆపలేదు. దీనితో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారుపై దూకారు.
ఆ తర్వాత కారుని మాత్రం సదురు వ్యక్తి ఆపలేదు. ఈ వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాలో వైరల్ అయింది. ఈ ఘటన ఈ నెల 12 న జరిగింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులులు పోలీస్ స్టేషన్లో కారు డ్రైవర్ శుభంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
#WATCH An on-duty Delhi Traffic Police personnel in Delhi's Dhaula Kuan dragged on the bonnet of a car for few metres after he attempted to stop the vehicle for a traffic rule violation. The car driver was held later.(12.10.20) #Delhi pic.twitter.com/R055WpBm8M
— ANI (@ANI) October 15, 2020