బ్రేకింగ్: బెంగాల్ లో కొత్త వేరియంట్, రోగ నిరోధక శక్తి కూడా వేస్ట్…?

పశ్చిమ బెంగాల్ లో మరో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ‘ట్రిపుల్ మ్యూటాంట్ వేరియంట్’ ని పశ్చిమ బెంగాల్ లో గుర్తించారు. దీన్ని ‘బెంగాల్ వేరియంట్ ‘ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఇతర జాతుల కంటే అత్యంత ప్రమాదకరం అని వెల్లడించారు. ఈ వేరియంట్ ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో చెలామణి అవుతుండగా , ఢిల్లీ, మహారాష్ట్ర నుండి వచ్చిన వారిలో కూడా ఇది ఉందని గుర్తించారు.

ఈ వేరియంట్ వ్యాక్సిన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో E484K మ్యుటేషన్ ఉండటం ఆందోళన కలిగిస్తుందని చెప్తున్నారు. E484K అనేది ప్రధాన రోగనిరోధక ఎస్కేప్ వేరియంట్ గా చెప్తున్నారు. వీటికి టీకా సామర్ధ్యం పని చేసే అవకాశం ఉండదు. దీనిపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. దీనితో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.