ఖమ్మంలో ఆదివారం సాయంత్రం దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేటు హాస్టల్లోని గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మానస మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. అయితే.. కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
కుటుంబ సమస్యలే వరంగల్ కు చెందిన మెడికో మానస ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆమె చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. మానస ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె తండ్రి కూడా చనిపోయారు. దీంతో అప్పటినుంచి బాధలో ఉన్న మానస… నిన్న రాత్రి హాస్టల్ లో పెట్రోల్ పోసుకొని నిప్పంట్టించుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.