ధ్రువ్‌ హెలికాప్టర్లకు క్లియరెన్స్‌ పునరుద్ధరించిన సైన్యం

-

ధ్రువ్ హెలికాప్టర్లకు క్లియరెన్స్‌ను భారత సైన్యం మరోసారి పునరుద్ధరించింది. దాదాపు నెలరోజులుగా ఈ దేశీయ హెలికాప్టర్లను సైన్యం వినియోగించడం లేదు. తాజాగా కొన్ని షరతులతో కూడిన క్లియరెన్స్‌ను జారీ చేసింది. దీంతో కేవలం కొన్ని పరిమిత, అత్యవసర ఆపరేషన్ల కోసం మాత్రమే దీనిని వినియోగించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ హెలికాప్టర్లను పూర్తిగా తనిఖీలు చేసి అవసరమైన ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ లభించిన తర్వాత మాత్రమే ఎగరాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం సైన్యం వద్ద దేశీయంగా తయారు చేసిన 145 ధ్రువ్‌ హెలికాప్టర్లు ఉండగా.. వాయసేన వద్ద 70, నౌకాదళం వద్ద 18, కోస్టుగార్డ్‌ వద్ద 20 వరకు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం హెలికాప్టర్లకు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి ఫిట్‌నెస్‌ లభించిన తర్వాతే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది.

మే4 తేదీన జమ్ము కశ్మీర్‌లో జరిగిన ధ్రువ్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒక టెక్నిషియన్‌ మృతి చెందగా ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత నిబంధనల ప్రకారం సైన్యం ధ్రువ్‌ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news