ఇక ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి…!

-

కరోనా కట్టడిలో ఆరోగ్య సేతు యాప్ ని ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా వాడాలని భావిస్తున్నాయి. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ యాప్… ఇప్పుడు కోట్లాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు యాప్ ని అందరూ తప్పనిసరిగా వాడాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిని వాడమని సూచనలు చేస్తున్నారు. దీనిలో సమాచారం కూడా భద్రం.

దీనిపై ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. అంత పక్కాగా ఎలా తయారు చేసారని కేంద్రాన్ని అడుగుతున్నాయి. యాపిల్, గూగుల్ లాంటి సంస్థలు కూడా దీన్ని తమ ఫోన్ లో అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇదిఇలా ఉంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా అందిస్తారు. గూగుల్ మ్యాప్స్, ప్లే స్టోర్ లాంటి యాప్స్ ఉన్నట్టు గానే ఆరోగ్య సేతు యాప్ కూడా ఉంటుంది.

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత భారతదేశంలో విక్రయించే ప్రతీ స్మార్ట్ ఫోన్ లో కూడా దీనిని ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ చేస్తారు. ఫోన్ వాడాలి అంటే కచ్చితంగా యాప్ లో రిజిస్టర్ అవ్వాలని సమాచారం. అందుకు గాను ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కూడా జరిపిందని సంబంధిత వర్గాలు జాతీయ మీడియాకు వివరించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

దీనిని స్మార్ట్ ఫోన్ లో వచ్చేలా చర్యలు తీసుకోవడానికి గానూ కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీని నియమిస్తుంది. ఆ ఏజెన్సీ స్మార్ట్ ఫోన్ కంపెనీలతో చర్చలు జరిపి కొత్త మొబైల్స్‌లో ఆరోగ్య సేతు యాప్ ఉండేలా సరికొత్త చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య సేతు యాప్‌ను ఇప్పటికే 7.5 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేసారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆరోగ్య సేతు యాప్ 5 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news