గాల్వాన్ లో ఏం జరుగుతుందో ప్రధాని దేశ ప్రజలకు చెప్పాలి : అసదుద్దీన్ ఓవైసీ

-

చైనా, భారత్ ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయి. వాళ్ళు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్దం కావడం లేదు అన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. దేశానికి ఏం చెప్పదలచుకున్నారు..? బిజెపి సర్కార్ చైనా ముందు ఎందుకు మోకరిల్లుతోంది. చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకు స్పెషల్ పార్లమెంట్ ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు ఒవైసీ.

బోర్డర్ లో ఏదైనా జరిగితే… Restore చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ భారత్ సర్కార్ ఏమి చేస్తుందని.. ఇవన్నీ ఒకవైపు సాగుతూ ఉంటే భారత ప్రధాని చైనా ప్రధాని తో భేటీ అవ్వడం ఏమిటీ??బిజెపి దేశ ప్రజల వద్దా ఏమి దాస్తోంది అని ప్రశ్నించారు. గాల్వాన్ లో ఏం జరుగుతుందో దేశ ప్రజల కు చెప్పాలని.. 19సార్లు చర్చలు జరిగాయి.. ఆ చర్చల్లో ఏం జరిగిందో చెప్పాలి కోరారు. లడ్డక్ లో ఏం జరుగుతుందో చెప్పకుండా దాచిపెడుతోంది అని మండిపడ్డారు అసదుద్దీన్.ఆర్మీ నీ అగ్రిమెంట్ ల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదే అంశం పై పార్లమెంట్ లో చర్చ జరగాలని..  అందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news