వైద్య ప్ర‌పంచంలో ఆయుర్వేదం ముఖ్య పాత్ర పోషిస్తోంది: ప్ర‌ధాని మోదీ

-

ఆయుర్వేద దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ రెండు ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు. గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్ఏ), రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ)ల‌ను ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు.

ayurveda playing big role in medical world pm modi

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. వైద్య ప్ర‌పంచంలో ఆయుర్వేదం ప్ర‌స్తుతం ఎంతో గుర్తింపును పొందింద‌ని, ఆ రంగంలో ఆయుర్వేదం కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు. అల్లోప‌తి, ఆయుర్వేద వైద్య విధానాల‌ను ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటున్నారని అన్నారు. ఈ రెండు వైద్య విధానాల‌తో వైద్యులు ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌ల‌ను అందిస్తుండ‌డం శుభ ప‌రిణామ‌మ‌న్నారు.

దేశంలోని రెండు ఉత్త‌మ స్థాయి ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ల‌ను ఓపెన్ చేశామ‌ని, అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో వైద్య విద్య‌ను బోధించాల‌ని మోదీ అన్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ బాగా పెరుగుతుంద‌ని, ముఖ్యంగా క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే అశ్వ‌గంధ వంటి మూలిక‌ల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల ఆయా మూలిక‌ల ఉత్ప‌త్తిని ఇంకా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. కాగా రెండు కార్య‌క్ర‌మాల్లోనూ ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news