పసిడి ప్రియులకు చేదువార్త.. పెరిగిన బంగారం ధర..వెండి మాత్రం..

-

గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర నేడు పెరిగింది. హైదరాబాదులో మే 31న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పైకి చేరింది. దీంతో బంగారం ధర రూ. 52,200 కు ఎగిసింది. అలాగే ఆర్నమెంట్ బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ. 47,850 కి చేరింది. వెండి ధర మాత్రం రెండు రోజులుగా నిలకడగానే కొనసాగుతూ వస్తోంది. కేజీకి రూ .67 వేల వద్దనే ఉంది. ప్లాటినం ధర విషయానికి వస్తే 10 గ్రాములకు 80 పెరుగుదలతో రూ.23,880 కు చేరింది.

దేశీ మార్కెట్లో బంగారం ధర జిగేల్ మంటే .. గ్లోబల్ మార్కెట్లో మాత్రం ట్రెండ్ రివర్స్ లో ఉంది. బంగారం ధర ఔన్స్ కు 0.30 శాతం దిగివచ్చింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది 0. 80 శాతం పడిపోయింది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీ మార్కెట్లో గోల్డ్ రేట్ ను ప్రభావితం చేస్తుంటాయి. మరోవైపు దేశంలో ఎక్కువ బంగారం ఉన్న రాష్ట్రంగా బీహార్ నిలువనుంది. ఎందుకంటే జమూయి జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news