కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి హెల్త్ ప్రోటోకాల్స్ చాలా కాలం పాటు ఉంటాయని… టీకా లభించిన తర్వాత కూడా ప్రజలు మాస్క్క్ లు ధరించాల్సి ఉంటుంది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చీఫ్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ అన్నారు. లక్నో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) నిర్వహించిన వెబ్‌నార్‌లో డాక్టర్ భార్గవ మాట్లాడుతూ,
కోవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించినంతవరకు భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది జూలై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు. భారతదేశం ఒక టీకాను అభివృద్ధి చేస్తుంది, అది తనకే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 60 శాతం మందికి అని చెప్పారు. కోవిడ్ -19 ను ముగించడానికి టీకాలు సరిపోవు అని ఆయన స్పష్టం చేసారు.