బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలైనప్పటి నుండి మోనాల్ పై ప్రేక్షకుల్లో తీవ్ర నెగెటివిటీ నెలకొంది. ఆ నెగెటివిటీ రోజు రోజుకీ పెరుగుకుంటూ వచ్చింది. ఐతే ప్రతీసారీ సేవ్ అవడమే అందరికీ షాకిస్తుంది. శనివారం ఎపిసోడ్ లో కూడా మోనాల్ సేవ్ అవడం విచిత్రంగా ఉంది. మోనాల్ సేవ్ అవుతూ ఉండడం చూస్తుంటే, బిగ్ బాస్ యాజమాన్యమే కావాలని మోనాల్ ని కాపాడుతూ వస్తుందని, ఆమెను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే కుమార్ సాయి, దేవి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లని బయటకి పంపేసారని అనుకుంటున్నారు.
ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ విజేత మోనాల్ అయ్యే అవకాశం ఉందని తేల్చేస్తున్నారు. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే మోనాల్ ని కాపాడుతున్నారని, ప్రేక్షకుల ఓట్లకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో దండిగా వినబడుతుంది. ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ పై నమ్మకం తగ్గే అవకాశం ఉంది. అది వచ్చే సీజన్లపై ప్రభావం చూపించనుంది. మరి ఆ విషయం బిగ్ బాస్ యాజమాన్యం ఎందుకు ఆలోచించట్లేదో..!