బ్యాటిల్ గ్రౌండ్స్ డేటాని చైనాకి పంపడంతో… గేమ్ ని బ్యాన్ చెయ్యాలని CAIT డిమాండ్..!

2021 లో ఎదురు చూసిన వాటిలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఒకటి అని చెప్పవచ్చు అయితే ఇది ఎప్పుడు విడుదల అవుతుందని అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. ఎర్లీ యాక్సెస్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది.

 

ఇప్పటికే 5 మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దీనికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే పబ్జి ని బాటిల్ గ్రౌండ్ గా మార్చడం వల్లనే. అయితే తాజాగా దీనికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చలు మొదలయ్యాయి.

ఈ ఆట తాలూక ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ డేటాని భారతదేశం, సింగపూర్ దేశాలకి ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేసి గేమ్ ని ఆపరేట్ చేయడానికి చేస్తారు. అయితే గేమ్ డెవలపర్స్ కి ఈ ఒక్క విషయం చాలు భారతదేశం ఒప్పుకునేందుకు.

కానీ తాజాగా మరొక విషయం జరిగింది. ఈ డేటని చైనా, హాంగ్ కాంగ్, యుఎస్ మరియు మాస్కో కి పంపించి స్టోర్ చేసే అవకాశం కనబడుతోంది. ఐజియం ఇండియా ప్రకారం ఈ డేటాని చైనా కి కూడా పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐజిఎన్ ఇండియా పంచుకున్న ఒక నివేదిక ప్రకారం, చైనాతో సహా అనేక ఇతర ప్రాంతాలలోని సర్వర్లకు డేటాను షేర్ చేసుకుంటున్నారు. ఈ డేటాను ముఖ్యంగా బీజింగ్‌లోని చైనా మొబైల్ కమ్యూనికేషన్ సర్వర్లు, హాంకాంగ్‌లోని టెన్సెంట్ నడుపుతున్న ప్రాక్సిమా బీటా, అలాగే ముంబై, మాస్కో మరియు యుఎస్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్‌లకు పంపబడింది. దీనితో గేమ్ ని బూట్ చేస్తున్నప్పుడు, ఇది బీజింగ్‌లోని టెన్సెంట్ సర్వర్‌కు కూడా తెలియజేస్తుంది.

దీనితో ఈ గేమ్ ని నిషేదించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు CAIT లేఖ వ్రాసింది.