Bharat Bandh : నేడు భారత్ బంద్…విద్యాసంస్థలకు సెలవు ఉంటుందా ?

-

Bharat Bandh : నేడు భారత్‌ బంద్‌. ఈ బంద్‌ దేశ వ్యాప్తంగా కొనసాగనుంది. కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

Bharat Bandh

ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులన్నింటినీ స్తంభింపజేస్తామని తెలిపారు. ఇందుకు రైతులందరూ సహకరించాలని కోరాయి కార్మిక సంఘాలు. కాగా భారత్‌ బంద్‌ నేపథ్యంలోనే కొన్ని చోట్ల విద్యాసంస్థలు మూత పడనున్నాయి. మరికొన్ని చోట్ల యథావిధిగా కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news