ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట శిక్ష విధింపులు ట్రైల్ కోర్టు సరైన కారణం చూపించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయం తెలిపింది.
కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును వ్యాఖ్యానిస్తూ.. రాహుల్ గాంధీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో… కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోవడమే కాకుండా ఆయనకు జైలు శిక్ష కూడా విధించింది సూరత్ కోర్టు. అయితే ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.