ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్‌

-

కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ అధికారులు శనివారం కోర్టులో అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొంత ఊరట లభించింది. అనుబంధ చార్జ్ షీట్ లో ఆమె పేరు ప్రస్తావనకు రాలేదు. ఈ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత భాగస్వామిగా ఉన్నారంటూ ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ప్రధాన చార్జ్ షీట్ లోను ఆమె ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడి, సిబిఐ అధికారులు కవిత పేరును ప్రస్తావించారు. సిబిఐ తాజాగా దాఖలు అనుబంధ చార్జ్ షీట్ లో కల్వకుంట్ల కవిత పేరు లేదు. అయితే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఇండియా ఆహెడ్ మాజీ ఉద్యోగి అరుణ్ పాండే, అమన్ దీప్ దళ్ ను సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ లో నిందితులుగా చేర్చింది. ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా ఆధారాలను ధ్వంసం చేసిన తీరును వివరించింది. దీంతో కల్వకుంట్ల కవిత కు రిలీఫ్ దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news