నేడు నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. రెండు దఫాలుగా కొనసాగనున్న కార్యక్రమాల్లో ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
కాగా, త్రికోణాకారంలో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. దాదాపు రూ.1200 కోట్లతో భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు. ఇవాళ ఉదయం పూజ లో ప్రధాని మోడీ, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ తదితరులు పాల్గొననున్నారు. పూజ తర్వాత, సరిగ్గా ఉదయం 8.35 గంటలకు నూతన పార్లమెంట్ భవనంలోని “లోకసభ ఛాంబర్” లోకి అడుగు పెట్టనున్నారు ప్రధాని మోడి. “లోకసభ ఛాంబర్” లో ఉదయం 8.35 గంటల నుంచి 9 గంటల మధ్య “అధికారానికి, అధికార మార్పిడి” కి చిహ్నమైన “సెన్ గోల్” ( రాజ దండం) స్థాపన కార్యక్రమం ఉంటుంది.