బ్రేకింగ్ : మొదలయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల వోటింగ్

అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. బీహార్ లో ఉన్న మొత్తం 243 స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఈ రోజు మొదటి విడతగా బీహార్ లోని 6 జిల్లాలోని 71 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 71 స్థానాల్లో 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీహార్ తొలివిడతలో ఆర్జేడీ 42, జెడీయు 41, ఎల్జెపి 41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే ఈ తొలి విడతలో బిజెపి 29, కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపధ్యంలో చాలా పకడ్బందీగా పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా నేపధ్యంలో ఎక్కడిక్కడ అన్ని నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేసింది. కరోనా నేపధ్యంలో 80 ఏళ్లు దాటిన అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.